Tuesday, December 3, 2024

పింఛన్ డబ్బుల కోసం తల్లిని హతమార్చిన కొడుకు

- Advertisement -
- Advertisement -

మద్యానికి బానిసై పింఛన్ డబ్బుల కోసం కన్నతల్లిని కొడుకు హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా, నిజాంపేట మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చల్మేటి దుర్గవ్వ (75)ను కొడుకు రామచంద్రం మద్యం తాగడానికి అర్ధరాత్రి డబ్బులు కోసం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంలో తల్లిని హత్య చేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కూతురు నాగుల విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే దుర్గవ్వ మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News