Tuesday, December 24, 2024

కన్న కొడుకే కాలయముడై..

- Advertisement -
- Advertisement -

ములుగు: కన్న కొడుకే కాలయముడై కనిపెంచిన తల్లిని కిరాతకంగా హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండల బండమైలారంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గజ్వేల్ రూరల్ సిఐ జానకిరామ్ రెడ్డి, ములుగు ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ములుగు మండలం బండమైలారానికి చెందిన మిరియాల వెంకటమ్మ (45) తన కుమారుడు ఈశ్వర్‌తో కలిసి పూసలు, ప్లాస్టిక్ వ్యర్థ్ధాలను సేకరించి అమ్ముతూ జీవనం సాగిస్తుంది. కాగా ఈశ్వర్‌కు వివాహం చేయడం లేదని వెంకటమ్మపై కక్ష పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో దూరపు బంధువైన పర్వతం రాముతో కలిసి పథకం వేసి తల్లి తల నరికి హత్య చేశాడు. ఈ నేరం తమపై వస్తుందేమోనన్న అనుమానంతో వెంకటమ్మ కాళ్ళకు ఉన్న కడియాల కోసం దొంగలు హత్య చేసినట్లుగా చిత్రీకరించేందుకు మృతురాలి రెండు కాళ్ళు నరికి కడియాలు తీశారు. అయితే తన తల్లి మృతి విషయం తెలుసుకున్న వెంకటమ్మ కూతురు శైలజ తల్లి మృతిపై అనుమానంతో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న ములుగు పోలీసులు, సిఐ జానకిరామ్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి 10 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి, నిందితులిద్దరిని రిమాండ్‌కు పంపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News