Wednesday, January 22, 2025

ప్రేమ వ్యవహారం… కూతురి ప్రాణం తీసిన తల్లి?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో దారుణం వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో ఇంజినీరింగ్ విద్యార్థిని భార్గవి(19) మృతి చెందింది. సోదరుడి పిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతి పరువు హత్యగా పోలీసులు భావిస్తున్నారు. యువతిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి. యువతిని తల్లి కొట్టి చంపిందని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. యువతి ప్రేమ వ్యవహారంలో కుటుంబ సభ్యుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News