Monday, December 23, 2024

తల్లి చేతిలో తనయుడు హతం….

- Advertisement -
- Advertisement -

Old Man Murder In Birpur At Jagtial

మనతెలంగాణ/పాల్వంచ టౌన్ : తల్లిదండ్రులను వేధిస్తుండడంతో తనయుడిని తల్లి చంపిన సంఘటన శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెంకటేశ్వర్ హిల్స్ కాలనీలో మట్టారెడ్డి-శంకుతాల అనే దంపతులు నివసిస్తున్నారు. మట్టారెడ్డి ఫోర్ మెన్ ఉద్యోగం చేసి విరమణ తీసుకున్నాడు. ఈ దంపతులకు నవీన్ రెడ్డి (35) అనే కుమారుడు ఉన్నాడు. నవీన్ రెడ్డి మద్యానికి బానిస కావడంతో రోజూ తల్లిదండ్రులను వేధించేవాడు. అతడి వేధింపులకు తట్టుకోలేక నవీన్ రెడ్డి నిద్రిస్తున్న సమయంలో రొకలి బండతో తలపై మోదింది. ఈ ఘటనలో నవీన్ రెడ్డి తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. నవీన్ రెడ్డి చికిత్స శనివారం ఉదయం చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News