Monday, April 21, 2025

‘అమ్మతనాని’కి మాయని మచ్చ…

- Advertisement -
- Advertisement -

ఆందోళన రేపుతున్న వరుస ఘటనలు
తొందరపాటు చర్యలే కారణమా..!?

మన తెలంగాణ/హైదరాబాద్ : తల్లులు కర్కశంగా బిడ్డల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఇప్పుడు సమాజంలో ఆందోళన రేపుతున్నాయి. అమ్మ తనం మృగ్యమవుతోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సృష్టికి మూలం అమ్మ, అలాంటి అమ్మ తన బిడ్డలను కడుపున పెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది. బిడ్డలకు చిన్న కష్టం వచ్చిన ఆ తల్లి గుండె విలవిలలాడుతుంది. అటువంటి అమ్మతనం ఇప్పుడు ఏమైపోతుంది? బిడ్డల పట్ల తల్లికి ఉండే మమకారం ఎటు పోతుంది? అన్నది ప్రతి ఒక్కరిలో మెదలుతున్న ప్రశ్న. బిడ్డల ప్రాణాలు తీస్తున్న తల్లులు తన ప్రాణం పోయినా బిడ్డల జీవితం బాగుండాలని కోరుకునే అమ్మ బిడ్డల ప్రాణాలు ఎందుకు తీస్తుంది? పేగు తెంచుకు పుట్టిన బంధాన్ని ఎందుకు కాదనుకుంటుంది? వంటి ప్రశ్నలు ప్రస్తుతం వరుస సంఘటనలను బట్టి పదే పదే ఉత్పన్నమవుతున్నాయి.

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 28న కన్న తల్లి రజిత కర్కశంగా ఆలోచించి ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపింది. వివాహేతర సంబం ధమే పిల్లల హత్యలకు కారణంగా పోలీసులు గుర్తించారు. భర్తను కూడా చంపేయాలని భావించగా, ఆరోజు అతడు పెరుగున్నం తినకపోటవం తో తృటిలో తప్పించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొన్నటికి మొన్న ఓ అమ్మ ఇద్దరు చిన్నారులకు మరణ శాసనం రాసింది. పిల్లలకు చిన్న గాయం అయితేనే తట్టుకోలేని కన్నతల్లి ఇద్దరు కుమారులను కొబ్బరి బోండాలు నరికే కత్తితో అత్యంత దారుణంగా నరికి చంపింది. హైదరా బాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ ఘటన మరచిపోక ముందే తాజాగా మేడ్చల్ బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ప్రగతినగర్ లో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల కన్న కూతురికి విషమిచ్చి కూతురు ప్రాణాలు తీసిన తల్లి, తను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 32 ఏళ్ళ కృష్ణ పావని కన్న బిడ్డకు విషమిచ్చి చంపి, తను కూడా విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కూకట్‌పల్లి ప్రసాద్ ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసి తల్లి కుమార్తెను చంపి, తను ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.

కష్టాలు ఎన్ని వచ్చినా, సమస్యలు ఏవైనా సరే ధైర్యంగా బిడ్డల కోసం ఎదుర్కోవలసిన తల్లులు, ఆ బిడ్డల ఉసురు తీసి, తాము కూడా ఆత్మహత్యలకు పాల్పడు తున్న ఘటనలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. క్షణికావేశంలో తల్లులు తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు అమ్మతనానికి మాయని మచ్చగా మారుతున్నాయి. ఇకనైనా తల్లులు కష్టాలు వచ్చినప్పుడు తాము ధైర్యంగా బతుకుతూ బిడ్డలకు బతుకుబాట చూపాలి కానీ, ఇటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడకూడదన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News