Monday, December 23, 2024

రాజస్థాన్‌లో తల్లి, పిల్లల విషాదాంతం

- Advertisement -
- Advertisement -

బర్మేర్ : రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాలో ఓ కన్నతల్లి పేగుబంధాన్ని కాదంటూ తన నలుగురు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండ్లీలో జరిగింది. స్థానికంగా ఉండే జీతారామ్ భార్య ఉర్మిల తన పిల్లలు నలుగురిని వడ్లు నిల్వ ఉంచే గుమ్మిలలో పెట్టి మూతలు పెట్టేసి వెళ్లి తాను ఉరేసుకుని చనిపోయింది. ఈ లోగా పిల్లలు గాలి ఆడక చనిపోయినట్లు వెల్లడైంది. భర్త జీతారామ్ తన కూలీ పనులకు జోధ్‌పూర్ పట్టణానికి వెళ్లిన దశలో ఊరిలో ఈ తల్లి దారుణానికి పాల్పడింది.

ఇంట్లో ఉరేసుకుని ఉన్న ఊర్మిళను పక్కింటివారు ముందుగా గుర్తించారు. అయితే సాయంత్రం వరకూ పిల్లలు కన్పించలేదు. చివరికి వెతికి చూడగా ధాన్యం నిల్వ ఉంచే వాటిలో పిల్లలు మృతి చెందిన ఉన్న స్థితిలో కన్పించారు. అయితే భర్త జీతారామ్ అత్యధిక కట్నం కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడని, ఐదుగురిని హత్య చేశాడని ఆమె పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోధ్‌పూర్‌కు వెళ్లినట్లు నమ్మించి భార్య పిల్లలగొంతుకోశాడని ఊర్మిళ పుట్టింటివారు రోదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News