Tuesday, December 24, 2024

ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /బోయినిపల్లి: మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ముగ్గురు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పో లీసుల వివరాల ప్రకారం… వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన రజిత కరీంనగర్‌కు చెందిన మహ్మద్ అలీని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు మహమ్మద్ అయాన్ (7), అసరాజా బిన్(5), ఉస్మాన్ అహ్మద్ (14 నెలల వయస్సు) ఉన్నారు.

అయితే గత కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరు గుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలతో సహా బయటకు వెళ్లింది. అయితే అప్పటి నుంచి రజిత కనిపించకుండాపోవటంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మిడ్‌మానేరులో వీరి మృతదేహాలను గుర్తించారు. కుటుంబ కలహాలతోనే రజిత తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News