Monday, December 23, 2024

తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ముత్తారం: డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్న కూతురును ఇంటి పనులలో తోడుగా ఉండాలని తల్లి మందలించినందుకు మనస్థాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఓడేడు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాములు, కటుంబ సభ్యుల వివరాల మేరకు కట్ల శ్వేత డిగ్రీ పూర్తి ఇంటి వద్దనే ఉంటున్నది. దీంతో తల్లి ఇంటి పనుల్లో సాయంగా ఉండాలని మందలించి, పొలం పనులకు వెళ్లారు.

దీంతో మధ్యాహ్నం వేళలో తల్లి ఇంటికి వచ్చి చూడగా ఇంటిలో ఉరి వేసుకొని కూతురు కనిపించింది. కిందికి దింపి స్థానిక వైద్యునికి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలు తండ్రి రమణాచారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News