Sunday, December 22, 2024

నవజాత శిశువును అమ్మిన తల్లి: 11 మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: డబ్బు కోసం అప్పుడే పుట్టిన మగ శిశువును విక్రయించిన తల్లిని జార్ఖండ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఛాత్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవజాత శిశువు తల్లి ఆశాదేవితో పాటు మొత్తం 11 మందిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు ఛాత్రా సబ్ డివిజనల్ పోలీసు అఫీసర్ అవినాష్ కుమార్ తెలిపారు. నవజాత శిశువు విక్రయం గురించి తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బొకారో జిల్లాలో శిశువును రక్షించడంతోపాటు నిందితులను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.

ఆశాదేవి నుంచి రూ. 1లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సహియా దీదీ అలియాస్ డింపుల్ దేవిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నవజాత మగ శిశువును రూ. 4.5 లక్షలకు కొనుగోలు చేసేందుకు హజారీబాగ్ జిల్లాలోని బడ్కాగావ్‌కు చెందిన ఒక జంట ఛాత్ర, బొకారోని ఇద్దరు బ్రోకర్లతో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన వివరించారు. బిడ్డ తల్లి ఆశాదేవికి రూ. 1లక్ష చెల్లించి మిగిలిన మొత్తాన్ని బ్రోకర్లు పంచుకున్నారని ఆయన చెప్పారు. ఛాత్రా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News