Monday, December 23, 2024

కామారెడ్డిలో తల్లీకుమారుడు నిప్పంటించుకొని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mother son commit suicide in Kamareddy

కామారెడ్డి: లాడ్జిలో తల్లీకుమారుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గది నుంచి శనివారం తెల్లవారుజామున పొగలు రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని బలవంతంగా డోర్‌ను ఓపెన్ చేశారు. ఇద్దరు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. మృతులు రామాయం పేటకు చెందిన తల్లి పద్మ, కుమారుడు సంతోష్‌గా గుర్తించారు. డిఎస్‌పి సోమనాథమ్, సిఐ నరేష్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లీకుమారుడు వీడియో తీసిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక రాజకీయ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News