Monday, January 20, 2025

బావిలో ఆరుగురు చిన్నారుల్ని విసిరేసి కడతేర్చిన తల్లి

- Advertisement -
- Advertisement -

mother threw six children in well At maharashtra

ముంబై : మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ జిల్లా మహద్ తాలూకాలో మంగళవారం కన్నతల్లే తన ఆరుగురు చిన్నారుల్ని నిర్దాక్షిణ్యంగా బావి లోకి విసిరేసింది. ఆ ఆరుగురు మృతి చెందారని పోలీసులు చెప్పారు. మృతుల్లో ఐదుగురు బాలికలు ఉన్నారు. ఇంట్లో జరిగిన గొడవల కారణం గానే తల్లి ఇలా ప్రవర్తించిందని పోలీసులు తెలిపారు. 30 ఏళ్ల ఆమెను భర్త తరఫు బంధువులు తీవ్రంగా కొట్టారని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ తన పిల్లల్ని అందర్నీ బావిలోకి విసిరేసిందని స్థానిక పోలీస్ అధికారి చెప్పారు. మృతులంతా 18 నెలల నుంచి 10 ఏళ్ల వయసు మధ్య ఉంటారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News