Monday, December 23, 2024

కొడుకుని కాలువలో పడేసిన తల్లి.. మొసళ్ల దాడితో బాలుని మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్ణాటకలో అమానుష సంఘటన వెలుగు చూసింది. భార్యాభర్తల గొడవ ఆరేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. వీరి వివాదం కారణంగా ఆరేళ్ల మూగవాడైన కొడుకును కాలువలో పడేయడంతో అందులోని మొసళ్లు బాలుడిని కొరికి చంపేశాయి. ఉత్తర కన్నడ జిల్లా దండెలి తాలూకాలో నివసించే సావిత్రి, రవికుమార్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిలో ఆరేళ్ల వినోద్ మూగవాడు.

సావిత్రి ఇళ్లల్లో పనులు చేస్తూ జీవిస్తుండగా, భర్త రవి తాపీ మేస్త్రీగా పనిచేస్తుంటాడు. తమ పెద్ద కొడుక్కి చెవులు వినబడక పోవడం, మాటలు రాకపోవడంతో అతడి విషయంలో కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. గత శనివారం ఇదే గొడవలో ఆవేశంతో సావిత్రి తన కొడుకుని ఓ కాలువలో పడేసింది. ఆ కాలువలో మొసళ్లు బాలుడిని దారుణంగా కొరికి చంపేశాయి. పోలీస్‌లకు సమాచారం తెలిసి కాలువలో గాలించగా, మరుసటి రోజు ఉదయం బాలుడి మృతదేహం లభ్యమైంది.

మృతదేహం అంతా మొసళ్లు కొరికిన గుర్తులు ఉన్నాయి. బాలుడి కుడి చేయి కనిపించలేదు. తల్లిదండ్రులు సావిత్రి, రవిని అదుపు లోకి తీసుకున్నారు. తన కొడుకు చావుకు భర్తే బాధ్యుడని సావిత్రి పేర్కొంది. ఏం చేతకాని కొడుకును కాల్వలోపడేసి చంపేస్తానని బెదిరించేవాడని చెప్పింది. ‘నా భర్త అలా మాట్లాడుతుంటే కొడుకు మాత్రం ఎంతవరకు నరకయాతన భరించగలడు. నాబాధను ఎవరితో చెప్పుకోగలను అని వాపోయింది. చివరికి తల్లిదండ్రులిద్దరినీ పోలీస్‌లు అరెస్ట్ చేసి వారిపై హత్య కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News