Sunday, April 13, 2025

విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదు: వెంకయ్యనాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రభుత్వ కళాశాలల్లో సంస్కృతాన్ని ఉంచాలని తెలంగాణ భావిస్తోందని విన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. ఇంటర్ లో సంస్కృతాన్ని ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావించడంపై ఆయన స్పందించారు. మార్కుల దృష్ట్యా ఉంచాలని చూస్తే మాత్రం పునరాలోచన చేయాలని చెప్పారు. విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని హితువు పలికారు. సంస్కృతం బోధించడంలో తప్పులేదని, సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మభాష ఆలంబనగా నిలుస్తుందని తెలిపారు. పిల్లలను మాతృభాషకు చేరువ చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News