Sunday, April 13, 2025

కన్నకూతుర్ని హత్య చేసిన తల్లికి ఉరిశిక్ష

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట మొదటి అదనపు
జిల్లా న్యాయమూర్తి తీర్పు
మన తెలంగాణ/మోతె : కన్నకూతుర్ని హత్య చేసిన తల్లికి సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉరి శిక్ష విధించారు. సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని బుర్కచర్ల ఆవాస గ్రామమైన మేకపాటి తండాకు చెందిన బానోత్ భారతి అలియాస్ లాస్య అలియాస్ బుజ్జిపై నేర నిరూపణ కావడంతో శుక్రవారం సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డా.శ్యాంశ్రీ నిందితురాలిని దోషిగా నిర్ధారిస్తూ ఉరి శిక్ష విధించినట్లు ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వె ళ్తే.. మండల పరిధిలోని బుర్కచర్ల ఆవాస గ్రామమైన మేకలపాటి తండాకు చెందిన బానోత్ కృ ష్ణతో భారతికి పెళ్లి జరిగింది. కొంతకాలం మం చిగా ఉన్నారు. వారికి ఒక పాప కలిగింది. ఆమె మానస్థిక పరిస్థితి బాగోలేక పూజలు చేస్తుండేది.

ఒక వ్యక్తి ఆమెకు  సర్పదోషం ఉన్నదని చెప్పాగా పూజలు చేస్తుండేది. 2021 ఏప్రిల్ 15న భర్త ఏపూర్ గ్రామానికి వెళ్లగా భారతి, పాప ఇద్దరే ఇంట్లో ఉన్నారు. కృష్ణ బావమరిది కృష్ణకు ఫోన్ చేసి పాపను భారతి కత్తితో గొంతు కోసి చంపిందని చెప్పగా వెంటనే ఇంటికి వచ్చి చూడగా పాప శవంగా కనిపించడంతో కృష్ణ మోతె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో భారతిపై హత్య నేరం కింద కేసు నమోదు చేసుకొని, అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.ఆంజనేయులు అభియోగపత్రం దాఖలు చేశారు. అనంతరం విచారణ న్యాయస్థానం సూర్యాపేట మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్.శ్యాంశ్రీ రూ.5 వేల జరిమానా, ముద్దాయి చనిపోయే వరకు ఉరి తీయాలని తీర్పులో పేర్కొన్నారు. కాగా, ఇది వరకు గుప్తనిధుల కోసం కట్టుకున్న భర్తనే చంపేందుకు ప్రయత్నం చేసిందని ఆమెపై సూర్యాపేట అసిస్టెంట్ సెషన్ న్యాయమూర్తి కోర్టులో కేసు నడవగా అందులో కూడా దోషిగా నిర్ధారిస్తూ ఒక సంవత్సరం జైలు శిక్ష పడింది. ప్రాసిక్యూషన్ తరుపున పిపి సవేందర్ కుమార్ వాదించారు. ప్రాసిక్యూషన్‌కు సహాయకులుగా లైసన్ ఆఫీసర్ జి.శ్రీకాంత్, పిసి నాగరాజు వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News