Monday, December 23, 2024

డ్రైవర్ సడన్ బ్రేక్‌లు.. పాపతో కింద పడిన తల్లి (వీడియో)

- Advertisement -
- Advertisement -

Mother With Baby Falls Down From Moving Bus In Cuddalore

కడలూరు: ప్రమాదవశాత్తూ ఓ ప్రైవేట్ బస్సు నుంచి కింద పడిన ఓ మహిళ తన బిడ్డతో సహా తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పన్రుటి, కడలూరు మధ్య వేగంగా నడుస్తున్న ప్రైవేట్ బస్సు నెల్లికుప్పం చేరుకుంది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బస్సులోపల చిన్నారితో కూర్చున్న ఓ మహిళ మెట్లపై నుంచి కిందపడింది. ఈ ఘటన మొత్తం నిఘా కెమెరాల్లో రికార్డైంది. అప్రమత్తమైన స్థానికులు వారి వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు  కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News