Monday, January 20, 2025

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి నవమాసాలు మోసి కన్న తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాలోని జైనథ్ మండలంలోని బాలాపూర్ గ్రామానికి చెందిన గణేష్ సుష్మ దంపతులకు నాలుగేళ్ల ఆదిత్య, రెండేళ్ల ఆర్యన్ లు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా గత రాత్రి ఇంట్లో గొడవ జరగగా బుధవారం ఉదయం భర్త గణేష్ పని నిమిత్తం బయటకు వెళ్ళడు. దీంతో తన ఇద్దరు కుమారులతో కలిసి సుష్మ గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ముందుగా తన నాలుగేళ్ల కుమారుడు ఆదిత్య తోపాటు రెండేళ్ల కుమారుడు ఆర్యన్ ను బావిలోకి తోసేసింది.

అనంతరం తాను బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనను గమనించిన స్థానికులు బావిలోకి దూకి ముగ్గురు ని బయటకు తీయగా, తల్లి క్షేమంగా బయటపడ్డప్పటికీ చిన్నారులు మాత్రం ఊపిరాడక బావిలోనే మృతి చెందారు. విగత జీవులుగా ఉన్న చిన్నారులను బావిలో నుండి తీసిన సన్నివేశాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటన గ్రామంతో పాటు జిల్లాలో విషాదాన్ని నింపింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న జైనథ్ సీఐ నరేష్ తో పాటు ఎస్ఐ బిట్ల పెర్సెస్ కేసు నమోదు చేసుకొని మృతదేహాలను రిమ్స్ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News