Monday, December 23, 2024

వర్ట్యువల్‌ ఎన్‌ఐసీయు నెట్‌వర్క్‌ను ప్రారంభించిన మదర్‌హుడ్‌ హాస్పిటల్‌..

- Advertisement -
- Advertisement -

దేశంలో సుప్రసిద్ధ ఉమెన్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌, మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌ , భారతదేశ వ్యాప్తంగా 10 నగరాలలో 21 హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు వినూత్నమైన రిమోట్‌ మానిటరింగ్‌ టెక్నాలజీ, సిస్టమ్‌ను వర్ట్యువల్‌ లైఫ్‌సేవింగ్‌ నియోనాటల్‌ కేర్‌ ను తగినంతగా నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు (ఎన్‌ఐసీయు) సదుపాయాలు లేని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నర్సింగ్‌ హోమ్‌లు, హాస్పిటల్స్‌లో చేరిన నవజాత శిశువులు పొందవచ్చు.

నవజాత శిశువులకు జీవితాలను కాపాడే క్లీనికల్‌ కేర్‌ను నియోనాటల్‌ కేర్‌ అందిస్తుంది. హెల్త్‌కేర్‌ రంగంలో అత్యాధునిక మరియు క్లీనికల్‌గా డిమాండింగ్‌ సేవలలో ఒకటిగా దీనిని భావిస్తుంటారు. మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌ ఎన్‌ఐసీయు లైవ్‌ (ూఐఇ్ఖ ఔజీఠ్ఛి) సొల్యూషన్‌ ఈ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోని నవజాత శిశువులకు సైతం నియోనాటల్‌ టెలి హెల్త్‌ సాంకేతికతలను విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి అత్యున్నత నైపుణ్యం కలిగిన నియోనాటాలజిస్ట్‌లు, నర్సుల సహకారంతో వినియోగించుకుని వర్ట్యువల్‌ నేషనల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ నెట్‌వర్క్‌ను సృష్టిస్తుంది. అత్యాధునిక రిమోట్‌ మానిటరింగ్‌ సాంకేతికతతో అత్యధిక ప్రమాదం కలిగిన నవజాత శిశువులు ఇప్పుడు అనుక్షణం మదర్‌హుడ్‌ నియోనాటాలజీ కేర్‌ టీమ్‌ నైపుణ్యం పొందగలరు. చాలా వరకూ హాస్పిటల్స్‌లో నియోనాటల్‌ కేర్‌, ఎన్‌ఐసీయు లైవ్‌ సదుపాయాలు ఉండవు. ఈ అంతరాలను పూరించడంతో పాటుగా నెలలు నిండకుండానే పట్టిన లేదంటే అతి తీవ్ర అనారోగ్యం బారిన పడిన నవజాత శిశువులకు చికిత్సను అందిస్తుంది.

ఎన్‌ఐసీయు లైవ్‌ అత్యాధునిక రిమోట్‌ మానిటరింగ్‌ సాంకేతికత, ప్రత్యేకీకరించిన డిజిటల్‌ పరిష్కారాలను సుదూరంలోని ఎన్‌ఐసీయులలో చేరిన నవజాత శిశువులకు చికిత్స నందించడానికి వినియోగిస్తుంది. మొదటి దశలో ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌ ఒక సెంట్రల్‌ కేర్‌ సెంటర్‌ (హబ్‌)ను బెంగళూరులోని తమ హాస్పిటల్స్‌లో ఏర్పాటుచేసింది. ఇది అనంతపూర్‌, హిందూపూర్‌, మదనపల్లె, పాట్నా, హిసార్‌లలో ఉన్న ఐదు ఎన్‌ఐసీయులతో అనుసంధానించబడి ఉంటుంది.

ఈ హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌ పూర్తి స్థాయిలో రోగి నిర్వహణ, స్ధిరంగా వైద్య మద్దతు అందించడంపై దృష్టి సారించింది. సెంట్రల్‌ కేర్‌ టీమ్‌ (హబ్‌) 24 గంటల పర్యవేక్షణ తో పాటుగా రిమోట్‌ ఎన్‌ఐసీయు (స్పోక్‌) కేంద్రాలకు హై రిజల్యూషన్‌ పీటీజెడ్‌ కెమెరాలను వినియోగించి మద్దతు అందిస్తాయి. ఇవి ప్రత్యక్షంగా వీడియో ఫీడ్‌ అందించడంతో పాటుగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ అవసరమైన కీలక సమాచారమంతా డిజిటల్‌గా అందిస్తుందనే భరోసా అందిస్తుంది. దీనితో పాటుగా టీమ్‌ల నడుమ స్థిరంగా కమ్యూనికేషన్‌ లింక్‌ ఉండటం వల్ల ఈ నవజాత శిశువులకు వైద్య ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. అదనంగా అనుభవజ్ఞులైన నియోనాటాలజిస్ట్‌లు, ఎన్‌ఐసీయు నర్సులకు తరచుగా అదనపు నైపుణ్యాలు అందించడంతో పాటుగా ఎన్‌ఐసీయు చికిత్సా పద్ధతులపై స్పోక్‌ సెంటర్‌ కేర్‌ టీమ్‌ కు సైతం శిక్షణ అందిస్తారు.

మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌ సీఈఓ విజయరత్న వెంకట్రామన్‌ మాట్లాడుతూ ‘‘విప్లవాత్మక నియో నాటల్‌ సొల్యూషన్స్‌ను తీసుకురావడంలో మదర్‌హుడ్‌ ఎప్పుడూ ముందుంటుంది. దేశంలో మారుమూల ప్రాంతాలకు సైతం ఎన్‌ఐసీయు సంరక్షణను చేరువచేయాలనే మా తాజా ప్రయత్నాలకు నిదర్శనంగా ఎన్‌ఐసీయు లైవ్‌ నిలుస్తుంది. గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలలో పలువురు నవజాత శిశువులకు తక్షణ ఎన్‌ఐసీయు కేర్‌ కావాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం అంతరాలను పూరించడంతో పాటుగా ఎన్‌ఐసీయును అందరికీ చేరువ చేస్తుంది. ఈ సాంకేతికత అత్యద్భుతమైనది. దీనితో మేము చేసేది చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. మేము మా ఆవిష్కరణలను కొనసాగిస్తాము మరియు రాబోయే సంవత్సరాలలో మరింతగా ప్రజలకు అనుకూలమైన పరిష్కారాలను ముందుకు తీసుకువస్తాము’’ అని అన్నారు.

మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌ వద్ద నియోనాటాలజిస్ట్‌, పిడియాట్రిషియన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ చంద్ర మాట్లాడుతూ ‘‘ ఎన్‌ఐసీయు లైవ్‌తో, హాస్పిటల్‌లో గడిపే సమయం గణనీయంగా తగ్గించగలమని భావిస్తున్నాము. అలాగే అత్యంత క్లిష్టమైన కేసులకు సైతం మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా సంతోషకరమైన ఫలితాలను సాధించగలమని ఆశిస్తున్నాము. క్లీనికల్‌ కోణం నుంచి చూస్తే, ఈ పైలెట్‌ ప్రోగ్రామ్‌ ఓ ఉదాహరణ : అడ్మిషన్‌ నుంచి డిశ్చార్జ్‌ వరకూ మొత్తం ప్రక్రియను సరళీకృతం చేస్తున్నాము. ఒకసారి ఈ ప్రోగ్రామ్‌లో మరిన్ని హాస్పిటల్స్‌ను తీసుకురావడం ద్వారా ఎన్‌ఐసీయు లైవ్‌ యొక్క చురుకైన జోక్యాలతో పాటుగా గైడెడ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ నియోనాటల్‌ కేర్‌లో బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేయనుంది’’ అని అన్నారు.

స్పెషలిస్ట్‌ల లభ్యత పరంగా ఉన్న అంతరాలను పూరించడంతో పాటుగా సంరక్షణ నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా ఎన్‌ఐసీయు లైవ్‌ తో భౌతిక ఎన్‌ఐసీయు వ్యయం కూడా గణనీయంగా తగ్గుతుంది. మారుమూల ప్రాంతాలలోని ఎన్‌ఐసీయులలో ఉన్న మరో సమస్య ఏమిటంటే పూర్తి స్థాయిలో నాణ్యమైన క్లీనిషియన్స్‌ లభ్యత లేకపోవడం. దీనితో పాటుగా అత్యాధునిక నర్సింగ్‌ అనుభవం లేకపోవడం, రికార్డులను సరిగా నిర్వహించకపోవడం వంటి సమస్యలూ ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ రిమోట్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ పరిష్కరిస్తుంది. మారుమూల ప్రాంతాలలో ఉన్న కుటుంబాలు కూడా అతి తక్కువ వైద్య ఖర్చుతో అత్యాధునిక ఎన్‌ఐసీయు కేర్‌ను తక్షణమే పొందవచ్చు.

నియోనాటాలజీ రంగంలో సంవత్సరాల తరబడి చేసిన ఆవిష్కరణల ఫలితం మదర్‌హుడ్‌ హాస్పిటల్స్‌ తాజా ప్రాజెక్ట్‌. దేశంలో అత్యంత క్లిష్టమైన కేసులను నిర్వహించడంలో, 300కు పైగా లెవల్‌ 3 ఎన్‌ఐసీయు పడకలను నిర్వహించడంలోని సమ్మిళిత అనుభవానికి ఇది ప్రతీక. గత ఐదు సంవత్సరాలలో దాదాపు 15వేలకు పైగా శిశువులు మదర్‌హుడ్‌ ఎన్‌ఐసీయుల సంరక్షణ పొందారు. ప్రస్తుతం, భారతదేశ వ్యాప్తంగా 15 ‘ఎన్‌ఐసీయుస్‌ ఆన్‌ వీల్స్‌’ నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపు 3500 మంది శిశువులను ఇవి కాపాడాయి. మదర్‌హుడ్‌ ఇప్పుడు 74 పట్టణాలలో సేవలనందిస్తూ ఒక లక్ష కిలోమీటర్లకు పైగా ప్రయాణించి శిశువులను చేరుకోవడంతో పాటుగా లివర్‌ కేర్‌కు తగిన సంరక్షణనూ అందించింది.

‘‘మదర్‌హుడ్‌ ఎన్‌ఐసీయు లైవ్‌ రిమోట్‌ నియోనాటల్‌ కేర్‌ను భారతదేశపు 3.5 మిలియన్‌ కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెటవర్క్‌పై ఆధారపడి తీర్చిదిద్దారు. దీనిద్వారా డాటా, చిత్రాలు, వాయిస్‌ సౌకర్యవంతంగా కేర్‌ హబ్‌, రిమోట్‌ స్పోక్‌ నడుమ ప్రయాణించడం వల్ల అత్యంత విలువైన నవజాత శిశువుల ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది. ఎన్‌ఐసీయు లైవ్‌ వర్ట్యువల్‌ నియో నాటాలజీ కేర్‌ నెట్‌వర్క్‌ రాబోయే ఐదు సంవత్సరాలలో భారతదేశ వ్యాప్తంగా 1000 పడకలకు చేరవచ్చు. ఇది నేషనల్‌ డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌కు నిదర్శరంగానూ నిలుస్తుంది’’ అని ఆపియా హెల్త్‌కేర్‌హోల్డింగ్స్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, విశాల్‌ బాలి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News