Thursday, January 23, 2025

కొడుకు నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి తల్లి ప్రయత్నం

- Advertisement -
- Advertisement -

లక్నో : నేరం చేయకపోయినా అమాయకుడైన తన కొడుకుని హత్య కేసులో ఇరికించి జైలు పాలు చేశారన్న ఆవేదనతో తల్లే రంగంలోకి దిగి కొడుకు నిర్దోషిత్వాన్ని రుజువు చేసే ప్రయత్నంలో ఉంది. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్‌లో 2015 లో 15 ఏళ్ల బాలిక కనిపించక పోవడంతో ఆమె తండ్రి గోండా చేసిన ఫిర్యాదుతో పోలీసులు విష్ణు అనే యువకుడిని అదుపు లోకి తీసుకున్నారు. పెళ్లికి ప్రలోభ పెట్టి కిడ్నాప్ చేసినట్టు నేరం మోపారు. కొంతకాలం తర్వార ఆగ్రాలో ఒక బాలిక అనుమానాస్పద మృతి వార్తను చూసి ఆ అమ్మాయి తండ్రి మృతురాలు తన కుమార్తే అని గుర్తించాడు. దీంతో విష్ణుపై హత్యానేరం మోపి జైలుకు పంపారు. నిందితుడు విష్ణు తల్లి ఇదంతా వాస్తవం కాదని నిరూపించి ఈ కేసు నుంచి తన కొడుకు బయటపడేలా ప్రయత్నించింది.

ఏ అమ్మాయి కిడ్నాప్ అయి, తరువాత హత్యకు గురైందని కేసు నమోదయ్యిందో ఆ అమ్మాయి బతికే ఉందని తెలుసుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బాధితురాలిని హత్రాస్‌లో పట్టుకోగలిగారు. ఈ కేసులో మరిన్ని వివరాలు నిర్ధారించుకోడానికి ఆమెకు డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఆ పరీక్షలు తరువాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసులో ఆ అమ్మాయికి ప్రస్తుతం 22 ఏళ్లు కాగా, నేరారోపణలకు గురైన నిందితుడు విష్ణుకి 25 ఏళ్లు. దాదాపు ఏడేళ్లు గడిచాక ఈ కేసు కొలిక్కి రావడం విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News