హైదరాబాద్: ఎవరికైనా తల్లి రుణం తీర్చలేనిది. పుట్టినప్పటి నుంచి ఆమె తన పిల్లలను ఎంతో భద్రంగా కాపాడుకుంటుంది. ఎన్నో త్యాగాలు చేసి తల్లి తన పిల్లలను పెద్ద చేస్తుంది. అమ్మ అనురాగం అనితర సాధ్యం. ఆ అమ్మ శ్రమ, త్యాగానికి గుర్తుగా మన దేశంలో ఈ సంవత్సరం(2022) మే 8న మాతృ దినోత్సవం(మదర్స్ డే) జరుపుకుంటారు. ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే అన్ని దేశాల్లో ఒకే రోజున మాత్రం జరుపుకోరు. కొన్ని దేశాల్లో మే రెండో ఆదివారం దానిని జరుపుకుంటారు. అలాంటి దేశాల్లో భారత్ కూడా ఒకటి. ‘మదర్స్ డే’ తల్లులు అందరికీ ప్రత్యెేక దినం. కన్నతల్లికి పూజ్యభావాన్ని ఇచ్చే దేశం భారత్. 1900 శతాబ్ది ఆరంభం నుంచే ఈ మాతృ దినోత్సవం జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మాతృ దినోత్సవ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ‘మదర్స్ డే’ నాడు అందరూ తమ తల్లి ఆనందమయ జీవితాన్ని గడిపేలా, సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారు.
రేపే మాతృ దినోత్సవం
- Advertisement -
- Advertisement -
- Advertisement -