Saturday, November 23, 2024

ట్రిపుల్ ఐటిలో సీటు…. కూతురిని చంపిన తల్లి ప్రియుడు

- Advertisement -
- Advertisement -

Mothers lover murder her daughter

అమరావతి: ప్రకాశం జిల్లా లింగసముద్రంలో దారుణ హత్యకు గురైన ఐఐటి విద్యార్థిని ప్రశాంతి హత్య కేసు మిస్టరీ వీడింది. హత్యకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. వేలంపేటకు చెందిన ఈసునూరి మాధవి పదిహేనేళ్లుగా ఎఎన్‌ఎంగా లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిలో పనిచేస్తూ, కుటుంబ విభేదాలతో భర్తతోపాటు కుటుంబ సభ్యులకు దూరంగా కూతురు ప్రశాంతితో కలిసి లింగసముద్రంలో నివాసం ఉంటోంది. కాగా, మాధవి ఉండే కింది పోర్షన్‌లో ఉంటున్న జంగారెడ్డిపాలేనికి చెందిన వివాహేతుడైన సుంకర శ్రీకాంత్ పరిచయం సహజీవనానికి దారితీసింది.

ఈ విషయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు ఎటువంటి అభ్యంతరం తెలుపలేదు. మాధవికి వచ్చే జీతాన్ని శ్రీకాంత్ తన అవసరాలకు వాడుకోవడం పరిపాటిగా మారడంతో కూతురు ప్రశాంతి తల్లిని ప్రశ్నించడం ప్రారంభించింది. అంతేకాకుండా ఇటీవల ప్రశాంతి పదవ తరగతి పూర్తిచేసుకొని నూజివీడు ట్రిపుట్ ఐటిలో సీటు రావడంతో ఫీజు కోసం తల్లితోపాటు శ్రీకాంత్‌ను కూడా నిలదీసింది. దీంతో శ్రీకాంత్, మాధవిలు తమ సంబంధానికి, ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రశాంతి అడ్డుగా ఉండడంతో అంతమొందించాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 23న  ప్రశాంతి గొంతు నులిమి శ్రీకాంత్ హత్యచేసి, అనంతరం శవాన్ని మాధవి, శ్రీకాంత్, అతడి స్నేహితుడు గురుబ్రహ్మం సహాయంతో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తగులబెట్టారు. మరుసటి రోజు ఆ ప్రాంతానికి వారు వెళ్లి పరిశీలించగా శనం సగం కాలిపోవడంతో మట్టితో పూడ్చివేశారు. కాగా, స్థానికులకు ప్రశాంతి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవం వెలుగులోకి వచ్చాయి. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News