Sunday, January 19, 2025

మోత్కూరును రెవెన్యూ డివిజన్ చేయాలని మంత్రికి వినతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూరు: మోత్కూరు మున్సిపల్ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు శనివారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి ఏపీలో మండల వ్యవస్థ ఏర్పడకముందే మోత్కూరు పంచాయతీ సమితిగా ఉందని, మండల వ్యవస్థ ఏర్పాటుతో మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాలు ఏర్పాటయ్యాయని, 2017లో రాష్ట్ర ప్రభుత్వం మోత్కూరును విభజించి అడ్డగూడూరు మండలం ఏర్పాటు చేసిందని, ఈ నాలుగు మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మోత్కూరు అనుకూలంగా ఉంటుందని, అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు, రవాణా వసతులు ఉన్నాయన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నాలుగు మండలాల్లోని వంద గ్రామాలు, సరిపడా జనాభా ఉందని, మోత్కూరులో అన్ని రకాల సదుపాయాలు ఉన్నందున ఈ ప్రాంత అభివృద్ధి కోసం మోత్కూరు మున్సిపల్ కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News