Sunday, January 12, 2025

రెండు పాసివ్‌ ఫండ్స్‌ను విడుదల చేసిన మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ రెండు పాసివ్‌ ఫండ్స్‌ ను విడుదల చేసింది. అవి మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఫైనాన్షియల్స్‌ ఎక్స్‌ బ్యాంక్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ హెల్త్‌కేర్‌ ఈటీఎఫ్‌. ఈ రెండు ఎన్‌ఎఫ్‌ఓలనూ 14 జూలై 2022న తెరిచారు. జూలై 22వ తేదీ మూసివేస్తారు.

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఫైనాన్షియల్స్‌ ఎక్స్‌ బ్యాంక్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ వినూత్నమైన పాసివ్‌ ఫండ్‌. బ్యాంకులను మినహాయించి ఆర్ధిక సేవల రంగంలో అవకాశాలను ఇది అందిస్తుంది. ఈ ఇండెక్స్‌ను జూన్‌, డిసెంబర్‌ నెలల్లో రీబ్యాలెన్స్‌ చేస్తారు. ఈ ఇండెక్స్‌లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీ, ఎక్సేంజ్‌లు, ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, భీమా, కార్డ్‌ చెల్లింపులు, ఫిన్‌టెక్‌ మొదలైనవి ఉంటాయి.

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ ఎండీ–సీఈఓ నవీన్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘వినూత్నమైన అవకాశాలతో నూతన పెట్టుబడి అవకాశాలను తీసుకురావాలనే లక్ష్యంతో, ఆర్ధిక సేవల రంగంలో బ్యాంకులకు ఆవల సంపద సృష్టి అవకాశాలపై ఆధారపడి ఈ నూతన నేపథ్యం నిర్మించాము. నగరాలలో ప్రస్తుతం ఉన్న 35% జనాభా 50%కు వృద్ధి చెందుతుందన్న అంచనాల నేపథ్యంలో టర్మ్‌డిపాజిట్ల నుంచి నగదు క్యాపిటల్‌ మార్కెట్‌, భీమా వైపుకు మళ్లవచ్చు. అదే సమయంలో ఋణాలకూ డిమాండ్‌ పెరుగుతుంది’’ అని అన్నారు.

మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ హెడ్‌ ఆఫ్‌ పాసివ్‌ ఫండ్స్‌ ప్రతీక్‌ ఓస్వాల్‌ మాట్లాడుతూ ‘‘మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎస్‌ అండ్‌ పీ బీఎస్‌ఈ ఫైనాన్షియల్స్‌ ఎక్స్‌ బ్యాంక్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌ , మదుపరులకు ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు లభించవచ్చు. ఈ ఫండ్‌ నూతన తరపు ఆర్ధిక కంపెనీలలో పెట్టుబడులు పెడుతుంది’’అని అన్నారు.

ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో మదుపరులు కనీసం 500 రూపాయలు, ఆపైన పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.

Motilal Oswal Mutual Fund launches 2 Passive Funds

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News