Friday, November 22, 2024

మోడీ రూ.15 లక్షలు ఎప్పుడు ఇస్తావు: మోత్కుపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: 2014 ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామన్నా ప్రధాని మోడీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. టిఆర్ఎస్ భవన్ లో మోత్కూపల్లి మీడియాతో మాట్లాడారు. కుల వ్యవస్థ నిర్మూలించాలని సిఎం కెసిఆర్ నడుం కట్టారన్నారు. కేంద్రం అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తోందని, బడుగు బలహీనం వర్గాలను బిజెపి ప్రభుత్వం మోసం చేస్తోందని దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ఉచిత కరెంట్, సాగునీరు, పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మోత్కుపల్లి పొగిడారు.

ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరిచేదేదో ఢిల్లీకి పోయి అరవాలని సూచించారు. ప్రతి గుంట భూమికి రైతు బంధు ఇస్తున్న నాయకుడు కెసిఆర్ అని ప్రశంసించారు. బిజెపికి దమ్ముంటే దళిత బంధు దేశమంతా అమలు చేయాలని కోరారు. బిజెపికి వ్యతిరేకంగా ఊరూరా నిరసనలు తెలుపుతామని, బిజెపి-కాంగ్రెస్ అపవిత్ర కలయిక వల్ల ఈటెల గెలిచారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మూడు వేల ఓట్లే వచ్చినా రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా పిసిసి చీఫ్‌గా కొనసాగుతున్నాడని మోత్కుపల్లి దుయ్యబట్టారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఓట్లు గుండుగుత్తగా ఈటెలకు అమ్ముకున్నాడని, బిజెపి వాపును చూసి బలుపు అనుకుంటోందన్నారు. బిజెపి దుర్మార్గపు పాలనలో రైతులు చనిపోతున్నారని, ఉత్తర ప్రదేశ్ రైతులను కార్లతో తొక్కించి చంపుతున్నారని, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన బిజెపి తీరు మాత్రం మారడంలేదన్నారు. దళితుల గురించి మాట్లాడే అర్హత బిజెపి నేతలకు లేదన్నారు. ఎన్నికలోస్తే సర్జికల్ స్ట్రైక్స్ అని బిజెపి డ్రామాలు చేస్తోందని మోత్కుపల్లి చురకలంటించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి దొంగలు కేంద్రం పెద్దలకు తెలియకుండానే దేశం దాటిపోయారన్నారు. దొంగల నుంచి ముడుపులు అందుకున్నది బిజెపి నేతలే అని ఆరోపణలు చేశారు. దొంగలకు సద్దికట్టే ప్రభుత్వం బిజెపి అని, నీతిమంతులెవరూ బిజెపిలో ఉండలేరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News