Wednesday, January 22, 2025

భువనేశ్వరి ఏడుపు జగన్ కు తగులుతుంది: మోత్కుపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి ఏడుపు సిఎం జగన్ కు తగులుతుందని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ లో మోత్కుపల్లి నర్సింహులు నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మోత్కుపల్లి నిరసన దీక్షను కొనసాగించనున్నారు.

ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. “పెళ్లి రోజే చంద్రబాబు అరెస్టు ఏం ఆనందమో అర్థం కావట్లేదు. ప్రజా జీవతంలో కక్ష సాధింపులకు అర్థం లేదు. భువనేశ్వరి ఏడుపు జగన్ కు తగులుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు 4 సీట్లు కూడా రావు. జగన్ కళ్లకు అహంకార పొరలు కమ్మాయి. జగన్ వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని చంపేందుకు కుట్ర. చంద్రబాబు లేకుంటే ఎదురే ఉండదని జగన్ భావిస్తున్నారు. త్వరలో చంద్రబాబు కుటుంబ సభ్యులను కలుస్తా” అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News