Thursday, January 23, 2025

కాంగ్రెస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి, నీలం మధు..

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆయా రాజకీయ పార్టీలో టికెట్ రానీ ఆశావాహులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో జోరుగా చేరికలు జరుగుతున్నాయి.

శుక్రవారం పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, నీలం మధు, మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఖర్గే.. కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు 45మంది అభ్యర్థులతో కాంగ్రెస్.. సెకండ్ లిస్ట్ ను ఈరోజు సాయంత్రం ప్రకటించనుంది. దీంతో కాంగ్రెస్ రెండో జాబితాపై నేతల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News