Monday, December 23, 2024

ఆ మూడు పార్టీలపై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు పార్టీలు(వైఎస్ఆర్ సిపి, బిజెపి, బిఆర్ఎస్) కలిసి కుట్ర చేసి చంద్రబాబును చంపాలని చూస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును హింసించి బాధపెడుతున్నారని ఆయన వెల్లడించారు. ఎపిలో పేద ప్రజలు బితే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబును బయటకు రాకుండా చూసి ఓట్లను గుద్దుకోవాలని ప్రయత్నమా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు.

జగన్… డబ్బులిచ్చి మళ్లీ గెలవాలనే ప్రయత్నం మాదిరిగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని చూస్తున్నారు. చంద్రబాబుకు ఏమైనా అయితే జగన్, కెసిఆర్, బిజెపిదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. జగన్ చర్యలను మోత్కుపల్లి తీవ్రంగా ఖండించారు. రాజధాని లేని రాష్ట్రాన్ని పాలిస్తున్న ఏకైక సిఎం జగన్ అన్నారు. చంద్రబాబు కుటుంబానికి భద్రత లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News