Saturday, November 23, 2024

అక్కరకురాని బిజెపి

- Advertisement -
- Advertisement -

 

Motkupalli Narasimhulu fires on BJP

దళిత బంధు అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుంది, కార్పొరేట్లకు తొత్తులు బిజెపి నేతలు, ఆ పార్టీ వల్ల ఏ వర్గానికి ప్రయోజనం లేదు
తీవ్ర స్థాయిలో మోత్కుపల్లి ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎవ్వరికీ అక్కరరాని పార్టీ బిజెపి అని టిఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మోడీ నేతృత్వంలోని బిజెపి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఏడేళ్లు అవుతున్నా దేశంలో ఏ వర్గానికైనా దళిత బంధు వంటి పథకాన్ని అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. దళిత సంక్షేమం కోసం ఎవరూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధు వంటి వినూత్న పథకాన్ని అమలు చేస్తుంటే దానికి కూడా బిజెపి నాయకులు అడుగడుగునా అడ్డుతగిలే ప్రయత్నం చేస్తుండడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శం కానుందన్నారు. అన్ని రాష్ట్రాలు విధిగా అమలు చేయాల్సిన పరిస్థితి కూడా రానుందన్నారు.

బుధవారం టిఆర్‌ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర బిజెపి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు అడుగులకు మడుగులొత్తుతున్న బిజెపి నాయకులకు దళితులంటే ఇసుమంతైనా ప్రేమ, గౌరవం లేదన్నారు. నిజంగా ఆ పార్టీకి దళితుల సంక్షేమంపై ఏ మాత్రం శ్రద్ధ ఉన్న దళితబంధు పథకం దేశమంతాటా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి వల్లే దేశంలో ఇంకా కులవ్యవస్థ ముందుకు నడుస్తోందన్నారు.

2014 ఎన్నికలప్పుడు బిజెపి ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని కూడా ఇప్పటి వరకు మోడీ సర్కార్ నెరవేర్చలేదని మోత్కుపల్లి మండిపడ్డారు. ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోను…. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా పెట్రోల్,- డీజిల్ ధరలు రోజువారీగా పెంచడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అలాంటి పార్టీ నేతలకు రాష్ట్రంలో దళితబందుపైమిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చే అర్హత ఎక్కడుందని? అని ప్రశ్నించారు. దళితులకు వచ్చే లాభాన్ని అడ్డుకునే బిజెపి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

ఈటలది గెలుపు కాదు.. వాపు

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ది గెలుపు కాదని…అది ఒక వాపు అని మోత్కుపల్లి అభివర్ణించారు. కాంగ్రెస్ కలయికతో ఆయన దొడ్డిదారిన గెలిచాడని ఆరోపించారు. సొంత పార్టీనే అమ్ముకున్న వ్యక్తి పిసిసి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఆయనను ఇలాగే వదిలేస్తే సోనియాగాంధీ కుటుంబాన్ని కూడా అమ్ముకుంటాడని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఓట్లను ఈటెల కొనుకున్నాడంన్నారు. ఈటల గెలుపులో అసలు నీతే లేదన్నారు. దళితులభూములు-, ఆలయ భూములు తన దగ్గర ఉన్నట్లు ఈటలే చెప్పిండన్నారు. రేవంత్, బిజెపిల అక్రమ కలయికపై డప్పుల దండోరా ఊరూరా వేస్తామన్నారు.ఎస్సి కార్పొరేషన్- స్పెషల్ ఫండ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని…- కానీ దళితబంధు వల్ల నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పది లక్షల రూపాయలు పడుతున్నాయన్నారు. ఇంతకన్నా మంచి పథకం బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉంటే…చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్‌ను టచ్ చేయాలని చూస్తే…ఎవరైనా మాడిమసై పోతారన్నారు. కెసిఆర్ ఫార్మర్ హౌజ్‌ను దున్నుతా అంటున్న బండి సంజయ్‌కు కావాలంటే తాను ఒక ట్రాక్టర్‌ను కూడా ఇస్తానని వ్యంగ్యస్త్రాలను సంధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News