Wednesday, January 22, 2025

ప్రధాన మంత్రిగా ఒక్క క్షణం కొనసాగే హక్కు మోడీకి లేదు

- Advertisement -
- Advertisement -

Motkupalli Narasimhulu fires on Modi

టిఆర్‌ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రైతు చట్టాలపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత కోల్పోయారన్నారు. నైతిక బాధ్యత వహిస్తూఉ ఆ రోజే మోడీ రాజీనామా చేసి ఉంటే హుందాగా ఉండేదన్నారు. కానీ మోడీకి రాజకీయ కాంక్ష, పదవుల వ్యామోహం అధికంగా ఉందన్నారు. అందుకే రాష్ట్రాలపై ప్రధాని హోదాలో తనపెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. గతంలో పనిచేసిన ఏ ప్రధానులు కూడా మోడీ తరహాలో ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడవ లేదన్నారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారన్నారు. కేంద్రం తీరుకు నిరసనగానే రాష్ట్రాల హక్కులపై పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని కెసిఆర్ చాలా స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ఆయన చేసిన ప్రకటనకు దేశ వ్యాప్తంగా అనేక పార్టీలు, పలువురు ముఖ్యమంత్రులు మద్దతు తెలుపుతున్నారన్నారు.

దేశంలో కెసిఆర్‌కు పెరుగుతున్న ఆదరణ చూస్తే రాష్ట్రంలోని ప్రతిపక్షాలు బట్టలు చించుకుంటున్నాయని విమర్శించారు. శుక్రవారం బేగంపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ, విపక్షాలపై తనదైన శైలిలో విరుకుపడ్డారు. ప్రధానంగా బిజెపి నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ వాళ్ళు ఏదో జరిగినట్టుగా అరుస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన హామీలను విస్మరించిన కేంద్రంపై రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాష్ట్రం వారికి అవసరం లేదా? రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోరా? అని మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చి సుమారుఇ ఏడేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క విభజన హామీ అయినా నెరవేర్చారా? అని మోత్కుపల్లి నిలదీశారు. రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎటు పోయింది…రైళ్లు కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయిందన్న విషయం అసలు రాష్ట్ర బిజెపి నాయకులకు తెలుసా? అని మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు దండలు వేయడం కాదు.. దళిత జాతికి ఏం చేశారో చెప్పాలని ఈ సందర్భంగా బిజెపి నాయకులకు మోత్కులపల్లి సవాల్ విసిరారు.

దళిత బంధు ఇస్తున్న సిఎం కెసిఆర్‌పై విమర్శలు చేస్తుంటే మీరు (బిజెపి)ఎంత దుర్మార్గపు మనుషులో అర్థం అవుతుందన్నారు. దళితుల మీద బిజెపికి ఏ మాత్రం ప్రేమ ఉన్నా….. దేశవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోనే కెసిఆర్ ఆదర్శవంతంగా పాలన చేస్తుంటే బిజెపి నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు.ఆయనను తిట్టడమే పనిగా పెట్టుకుంటే.. ఖబడ్దార్ మిస్టర్ బండిసంజయ్ అని హెచ్చరించా రు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రాజ్యాంగం లో మార్పులు చేయాలని అన్నారని ఈ సందర్భంగా మో త్కుపల్లి గుర్తు చేశారు. అలాగే వాజపేయి ప్రభుత్వం కూ డా అప్పట్లో రాజ్యాంగ మార్పుకోసం ఒక కమిటీని వేసిందన్నారు. ఆయన బిజెపి పార్టీ కాదా?అని మోత్కుపల్లి ప్ర శ్నింతారు. దేశాన్ని దోచుకున్న దోంగలను బయట దేశానికి పంపిస్తున్న బిజెపి నాయకులు….ఇతరులకు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

ఇతర దేశాల్లో ఉన్న నల్ల ధనం తెచ్చి ప్రతి పేదవాడికి ఇస్తా అని బిజెపి ప్రభు త్వం.. ఎంత మందికి ఇచ్చారో చెప్పాలన్నారు. కేంద్రంలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటికి నోటిఫికేషన్ ఎం దుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సంవత్సరంకు 2కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న..మోడీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. ప్రభుత్వం లక్ష 35 వేల ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రానున్న రోజుల్లో మరో 70 వేల ఉ ద్యోగాలు కల్పించడానికి అవసరమైన కసరత్తు కూడా పూర్తి చేసిందన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని బిజెపి నాయకులు మాట్లాడాలన్నారు. లేనిపక్షంలో ఏ ఒక్క బిజెపి నాయకుడు కూడా రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News