- Advertisement -
హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలకు నిస్వార్థ సేవ చేసేందుకు బిజెపిలో చేరానని, తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకొని తనకే పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని బిజెపి రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సమాచారం ఇచ్చి సిఎం కెసిఆర్ ఏర్పాటు చేసిన దళిత సాధికారిత సమావేశానికి వెళ్లానని మోత్కుపల్లి పేర్కొన్నారు. పార్టీలో తనపై భిన్నాభిప్రాయలు వ్యక్తంకావడంతో తనని బాధించాయన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎస్‌సి వాళ్ల భూములను ఆక్రమించుకొని అవినీతికి పాల్పడిన వ్యక్తిని బిజెపిలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తన రాజకీయ అనుభవాన్ని బిజెపి ఉపయోగించుకోకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాని మోత్కుపల్లి మీడియాకు తెలిపారు.
- Advertisement -