Monday, December 23, 2024

మోటో జి62 5జి స్మార్ట్‌ఫోన్ విడుదల

- Advertisement -
- Advertisement -

Moto G62 budget 5G smartphone launched in India

న్యూఢిల్లీ: మోటరోలా సరికొత్త జి62 5జి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 16,249లకు అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 695 5జి ప్రాసెసర్, 120 హెచ్‌జెడ్ డిస్‌ప్లే, 12 5జి బ్యాండ్స్, స్టీరియో స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉ న్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఎహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ని రెండు వేరియంట్స్‌తో విడుదల చేశారు. 6+128జిబి ఫోన్ ధరని రూ. 17,999గా నిర్ణయించారు. అదే విధంగా 8+ 128జిబి ధరని రూ. 19,999గా నిర్ణయించారు. వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్, ఇఎమ్‌ఐ లావాదేవీల ద్వారా రూ.1750 తగ్గింపు పొందవచ్చు. దీనివల్ల మొదటి వేరియంట్ ధర రూ. 16,249లకు, రెండో వేరియంట్‌ని రూ. 18,249లకు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆగస్టు 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News