హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్డు భద్రతా, మహిళా సాధికారితలో భాగంగా ప్రముఖ మోటార్ వాహనాల తయారీ కంపెనీ మెస్సర్స్ హీరో మోటో కార్పొరేషన్ శనివారం నాడు రాష్ట్ర పోలీస్ శాఖకు 70 ద్విచక్ర మోటార్ వాహనాలను అందచేసింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పధకంలో భాగంగా 35 వాహనాలను పోలీస్ శాఖకు, మరో 35 బైక్ లను రాష్ట్ర అగ్నిమాపక శాఖకు అందచేసినట్లు అడిషనల్ డిజిపి సంజయ్‌జైన్ తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డిజిపి సంజయ్‌జైన్ మాట్లాడుతూ ఈ వాహనాల వల్ల మహిళా పోలీస్ అధికారులు నేరం జరిగే ప్రాంతానికి త్వరిత గతిన చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఎస్‌పి రాజేష్, ఫైర్ సర్వీసుల డైరెక్టర్ లక్ష్మి ప్రసాద్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ నారాయణ రావులతో పాటు హీరో మోటార్ సంస్థకు చెందిన కె.కె సుబ్రహ్మణ్యం,దిలీప్ రెడ్డి, పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్,ఫైర్ శాఖలకు మోటార్ బైక్‌ల అందజేత
- Advertisement -
- Advertisement -
- Advertisement -