Wednesday, January 22, 2025

వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలి

- Advertisement -
- Advertisement -

మహాదేవపూర్: రోడ్డు ప్రయాణం చేసే వాహనదారులు సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలని మహాదేవపూర్ ఎస్‌ఐ భవాని సేన అన్నారు. మండలంలోని కుదురుపల్లి మూలమలుపు వద్ద బుధవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ను ధరించి రోడ్డుపై ప్రయాణం చేయాలన్నారు.

వాహనాలను నిర్ణీత వేగంలో నడపాలని తెలిపారు. ప్రతి వాహనదారుడు బండి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని అన్నారు. నిబంధనలను పాటించకపోతే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఐ వెంట హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్, సిఆర్‌పిఎఫ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News