Saturday, December 21, 2024

వాహనదారులు పెండింగ్ చలానాలను చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

రేగొండ: వాహనదారులు వారి వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను చెల్లించాలని రేగొండ ఎస్‌ఐ ననిగంటి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మండలంలోని గోరికొత్తపల్లి వద్ద పెండింగ్ చలానాలు, మద్యం తాగి వాహనాలు నడిపై వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతారన్నారు. ప్రతి వాహనదారుడు పెండింగ్ చలానాలను చెల్లించాలని, లేకుంటే వారి వాహానాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎస్‌ఐ వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News