Saturday, July 6, 2024

మార్కెట్లోకి మోటో కొత్త ఫోన్..ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

- Advertisement -
- Advertisement -

ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ మోటో తన కొత్త ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రాను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ Motorola కంపెనీ Edge 50 Pro, Edge 50 Fusion సిరీస్‌లో వచ్చాయి. ఈ ఫోన్ అనేక ఫీచర్లతో రిలీజ్ అయింది.

ఈ Motorola ఫోన్ ధర గురించి మాట్లాడుతే..Motorola Edge 50 Ultra భారతదేశ మార్కెట్లో రూ. 59 వేల 999కి విడుదల చేసారు. ఫోన్ లాంచ్ అయిన తర్వాత కంపెనీ వినియోగదారులకు రూ.5,000 పరిచయ తగ్గింపును అందిస్తోంది. దీంతో రూ.54, 999 కే కొనుగోలు చేయొచ్చు. దీనితో పాటు మీరు బ్యాంక్ ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఈ ఫోన్‌పై మరిన్ని తగ్గింపులను పొందవచ్చు. కాగా, ఈ ఫోన్ మొదటి సేల్ జూన్ 24 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.

 

స్పెసిఫికేషన్‌లు

Motorola Edge 50 Ultra ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే..మీరు ఈ ఫోన్‌లో చాలా ఫీచర్లను పొందొచ్చు. ఈ Motorola ఫోన్ 6.7 అంగుళాల pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 2800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ ఫోన్ పనితీరు కోసం..Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్‌ని పొందుపరిచారు. స్టోరేజ్ గురించి మాట్లాడితే..ఇది 16 GB వరకు RAM ఎంపికను కలిగి ఉంది.

ఇక కేమెరా విషయానికి వస్తే..ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. దీని ప్రైమరీ లెన్స్ 50 MP ఉంది. ఇది కాకుండా 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా అందుబాటులో ఉంది. ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండడానికి 4500mAh బ్యాటరీ కలిగి ఉంది. ఇది 125W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News