Friday, November 22, 2024

సమగ్ర మహిళా శిశు సంక్షేమం కోసం సంయుక్త కృషి

- Advertisement -
- Advertisement -

MoU between UNICEF and NIRD

యూనిసెఫ్ ఎన్‌ఐఆర్‌డి మధ్య కుదిరిన ఎంఓయూ

మనతెలంగాణ/హైదరాబాద్ : సమగ్ర మహిళా శిశు సంక్షేమం కోసం సంయుక్తంగా కృషి చేసేందకు యూనిసెఫ్ జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థతో చేతులు కలిపింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డిలో యూనిసెఫ్, ఎన్‌ఐఆర్‌డి అధికారుల సమావేశం జరిగింది. శిశుసంరక్షణ, మహిళల సంక్షేమం దిశగా ఈ రెండు సంస్థలు దేశంలో సంయుక్తంగా కృషి చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం ఉమ్మడి ప్రాజెక్టును చేపడాతామని, తమ మధ్య కుదిరిన ఒప్పదం మేరకు ఈ ప్రాజెక్టు అమలులో అవసరమైన పరిశోధనలు, సమర్ధవంతమైన నిర్వహణలో నైపుణ్యతను ఉపయోగించుకోనున్నట్టు తెలిపారు.

ఎన్‌ఐఆర్‌డి డైరెక్టర్ జనరల్ డా.జి.నరేంద్ర కుమార్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ సోషల్ పాలసీ, మానిటరింగ్ ఎవాల్యూయేషన్ చీఫ్ హ్యున్‌హీ బాన్, ఎన్‌ఐఆర్‌డి రిజష్ట్రార్ డా. ఎం శ్రీకాంత్ ఎంఓయుపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్బంగా డిజి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అట్టడుగు స్థాయిలో అభివృద్ధిని పెంపొందించడంతోపాటు సామాజికంగా, సురక్షితమైన గ్రామీణ వ్యవస్థను ఏర్పాటు చేయటంపై దృష్టి సారిస్తోందన్నారు. మహిళలు, బాలల సంక్షేమాన్ని సంస్థాగతీకరించడం, గ్రామ పంచాయతీ ఆభివృద్ధి ప్రణాళికతో వారి కార్యాచరణ ప్రణాళికను ఏకీకృతం చేడయం ద్వారా మహిళలు, బాలల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. యునిసెఫ్ భాగస్వామ్యంతో ఎన్‌ఐఆర్‌డిలోని అభివృద్ధి అధ్యయనాల కేంద్రం ఈ దిశగా పనిచేస్తుందన్నారు. యుపిసెఫ్ అధికారి హ్యూన్ హీ బాన్ మాట్లాడుతూ పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి వాణిని వినిపించినప్పుడే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించగలమని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News