Monday, December 23, 2024

చారిత్రక పత్రాలకు కొత్త జీవం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారత్, ఇరాన్ దేశాల ఉమ్మడి వారస్వతాన్ని కాపాడుకోవడం చాలా అవసరమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ కె. తారకరామారావు అన్నారు. రెండు దేశాల సంస్కృతులు, నాగరికతలను ప్రభావితం చేసిన భాగస్వామ్య చరిత్ర ఉందన్నారు. ఇందుకు సంబంధించిన అనేక పత్రా లు తెలంగాణ స్టేట్ ఆర్కీవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చారిత్రక కళఖండాలు ఉ న్నాయన్నారు. పర్షియన్ చారిత్రక మాన్యుస్క్రిప్ట్ల మరమ్మత్తు, పరిరక్షణ, డిజిటలైజేషన్,కేటలాగ్ కోసం న్యూ ఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క కల్చర్ హౌస్, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్‌తో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఒక అగాహన ఒప్పందం చేసుకుంది. టి..-హబ్ ఫేజ్ 2.0లో మంత్రి కెటిఆర్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంబాసిడర్ డాక్టర్ అలీ చెగేని సమక్షంలో ఎంఒయు కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, దేశంలోని ప్రముఖ ఆర్కీవ్స్‌లో ఒకటైన తెలంగాణ స్టేట్ ఆర్కీవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అని అన్నారు. ఇందులో 1406వ సంవత్సరం నాటి బహమనీ, కుతుబ్ షాహీ, ఆదిల్ షాహీ, మొఘల్ రాజవంశాలకు సంబంధించిన అరుదైన మరియు చారిత్రక రికార్డుల సేకరణను కలిగి ఉందన్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో సుమారు 43 మిలియన్లకు పైగా డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. వీటిలో 80 శాతం రికార్డులు హైదరాబాద్ దక్కన్ ప్రాంతంలోని పూర్వపు రాజవంశాల అధికారిక భాషలు కావడం వల్ల క్లాసికల్ పర్షియన్, ఉర్దూ భాషల్లో ఉన్నాయని పేర్కొన్నారు. 1956 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన జిఓలు, గెజిట్లు మొదలైన వాటి అసలు కాపీలు కూడా రికార్డుల్లో ఉన్నాయన్నారు.

న్యూ ఢిల్లీలోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయంలోని కల్చర్ హౌస్‌లో ఉన్న నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ చే నిర్వహించబడిన ఈ కార్యక్రమం మిలియన్ల కొద్దీ చారిత్రక పత్రాలకు జీవం పోస్తుందన్నారు. అలాగే భవిష్యత్ తరాలకు రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని అందిస్తుందన్నారు. భారతదేశం,తెలంగాణ మధ్యయుగం,ఆధునిక చరిత్రపై వారి పరిశోధన కోసం ఈ సంస్థ క్రమం తప్పకుండా సహకరించే ఇతర దేశాల పండితులకు కూడా ఇది విలువైన ఆస్తి అవుతుందన్నారు. ఈ మొత్తం ప్రక్రియ రాష్ట్రానికి ఎటువంటి ఖర్చు లేకుండా జరుగుతోందన్నారు. దీనిని పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రభుత్వం భరిస్తుండడం సంతోషంగా ఉందన్నారు. దీనికి రాష్ట్ర ఐటి, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, రాష్ట్ర ఆర్కీవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ జరీనా పర్వీన్, నూర్ ఇంటర్నేషనల్ మైక్రోఫిల్మ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మెహదీ ఖాజే పిరి, రీజినల్ డైరెక్టర్ అలీ నిరూమంద్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News