- Advertisement -
ఇటలీ లోని సిసిలీలో శుక్రవారం ఎట్నా అగ్నిపర్వతం ఆగ్నేయ బిలం దగ్గర అద్భుత సంఘటన సాక్షాత్కరించింది. ఆ బిలానికి ఉత్తర భాగం వైపు గొయ్యి లోని బిలం నుంచి అగ్నిపర్వత సుడి వలయాలు ఏర్పడ్డాయి. ఈ అగ్నిపర్వత సుడి వలయాలకు కారణమైన భౌగోళిక పరిస్థితులు ఏమిటో ఇంతవరకు శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు. అయితే శిలాద్రవం మీద అత్యంత వేగంగా వాయువు విడుదల కావడం, అదే సమయంలో ఉద్గార బిలం క్రమబద్ధీకరణ కావడం ఈ రెండూ యాధృఛ్ఛికంగా కలియడంతో అగ్ని సుడి వలయాలు ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
- Advertisement -