Sunday, November 24, 2024

సెప్టెంబర్ నుంచి భారత్‌కు అందుబాటులో కైలాస పర్వతం

- Advertisement -
- Advertisement -

పితోరాగఢ్(ఉత్తరాఖండ్): పరమ శివుడి ననివాసంగా హిందువులు విశ్వసించే కైలాస పర్వతం ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి భారత సరిహద్దుల నుంచి కూడా భక్తులు సందర్శించే అవకాశం లభించనున్నది. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాకు చెందిన నభిధంగ్‌లోని కెఎంవిఎన్ హట్స్ నుంచి భారత్- చైనా సరిహద్దుల్లోని లింపూలేఖ్ కనుమ వరకు రోడ్డు తొలచే పనులు ప్రారంభించినట్లు సరిహద్దు ర్లో సంస్థ(బిఆర్‌ఓ) అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పనులు పూర్తవుతాయని వారు చెప్పారు. రోడ్డు పనులు పూర్తయిన తర్వాత రోడ్డు మీదుగా వెళితే కైలాస పర్వతాన్ని నేరుగా చూడవచ్చని బిపిఓకు చెందిన డైమండ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ విమల్ గోస్వామి తెలిపారు.

కైలాస పర్వత వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం హిరాక్ ప్రాజెక్టుకు అప్పగించింది. రోడ్డు కొండలను తొలచి రోడ్డు వేసే పనులు జోరుగా సాగుతున్నాయని, వాతావరణం అనుకూలిస్తే సెప్టెంబర్ నాటికి పనులన్నీ పూర్తవుతాయని ఆయన చెప్పారు. కొవిడ్ కారణంగా వాయిదాపడిన లిపూరేఖ్ కనుమ మీదుగా కైలాస-మానస సరోవర యాత్ర పునరుద్ధరణ కాలేదు. కైలాస పర్వతాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించాలన్న భారత ప్రభుత్వ ప్రయత్నాలు త్వరలోనే ఫలప్రదం కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News