Monday, December 23, 2024

అర్జెంటీనాలో పర్వతారోహణ.. సత్తా చాటిన తెలంగాణ బిడ్డ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టీఎన్‌జిఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సేవారత్న డా.యస్.ఎమ్. హుస్సేని (ముజీబ్) ప్రోత్సాహంతో తెలంగాణ ముద్దుబిడ్డ డిపిఆర్‌ఓ, ఐ అండ్ పీఆర్ డిపార్టెమెంట్లో సీనియర్ అసిట్టెంట్ గా పనిచేస్తున్న వేముల నితిన్ సౌత్ అమెరికా, అర్జెంటీనాలో పర్వతారోహణ చేసి భారతీయ జాతీయ పతాకం , టీఎన్‌జిఓ యూనియన్ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వేముల నితిన్ అర్జెంటీనా నుండి ముజీబ్ తో సంభాషిస్తూ అర్జెంటీనా పర్వతంపై భారత జాతీయ పతాకం ,టీఎన్‌జిఓ యూనియన్ పతాక ఆవిష్కరణ చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. తన ప్రయాణంలో సహకరించిన టిఎన్‌జిఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డా.ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్)కి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు శిరసు వంచి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో డాక్టర్ ముజీబ్ మాట్లాడుతూ మధ్యతరగతి ఉద్యోగి అర్జెంటీనాలో పర్వతారోహణ చేసి భారత జాతీయ పతాకము టిఎన్‌జిఓ యూనియన్ పతాక ఆవిష్కరణ చేయడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు. ఈ సంతోషాన్ని మాటల్లో వ్యక్తం చేయలేమని తాను పంపించిన ఫోటో చూసి కళ్ళల్లో నీరు తిరిగాయని తెలియజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వ ఉద్యోగిగా తమవంత కృషి అందరూ చేస్తున్నారని పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలనలో ఇటు ఉద్యోగులు అటు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని విజయ సంకేతాలు చేపట్టాలని మనసారా దేవుని కోరుకుంటూ వేముల నితిన్ కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News