Monday, January 20, 2025

ఎవరెస్ట్ పర్వతంపై తెలంగాణ బిడ్డ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ నాయక్ ఆదివారం నాడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి మువ్వన్నెల జాతీయ జెండాను ఎగుర వేసి తెలంగాణ ఖ్యాతిని దశ దిశలా చాటారు.

ఈ మేరకు 5,365 మీటర్ల ఎత్తున ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. త్రివర్ణ పతాకంతో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోటోను కూడా ఆయన ఎవరెస్ట్ పర్వతంపై ప్రదర్శించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News