Monday, December 23, 2024

వాయు కాలుష్యంతో నోటి క్యాన్సర్

- Advertisement -
- Advertisement -

వాయు కాలుష్య స్థాయిలు అత్యధికంగా ఉంటే నోటి క్యాన్సర్ తప్పదని తైవాన్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తైవాన్ లోని 66 వాయు నాణ్యత పరీక్ష కేంద్రాల నుంచి డేటా సేకరించారు. ఈ డేటాను 40 ఏళ్లు పైబడిన 4,80,000 మందికి చెందిన హెల్తు రికార్డుల డేటాతో పోల్చి పరిశోధించగా 11,617 నోటి క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. ఆయా వ్యక్తుల వయసు, ఓజోన్ ప్రభావం, స్మోకింగ్, తమలపాకు, జర్దా, వంటివి నమిలే అలవాటు ఇవన్నీ అధ్యయనం లోకి తీసుకున్నారు. గాలిలో కాలుష్య రేణువులు పిఎం 2.5 ఎస్‌గా గణిస్తుంటారు.

చదరపు మీటర్ పరిమాణం గాలికి 26.74 మైక్రోగ్రాముల వంతున సరాసరి వార్షిక పి.ఎం. 2.5 స్థాయిలను 40.37 మైక్రోగ్రాములు లేదా 43 శాతం ఎక్కువగా ఉంటే వ్యాధి పెరగడానికి వీలుంటుంది. అయితే ఈ పద్ధతిలో పరిగణించడం సరిగ్గా అర్థం కాని ప్రక్రియగా మారిందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ గతంలో సూచించిన మార్గదర్శకాల ప్రకారం పి.ఎం.2.5 ఎస్ సరాసరి వార్షిక స్థాయిలో క్యూబిక్ మీటర్‌కు 10 మిల్లీగ్రాములు కన్నా అధిగమించరాదు.

కానీ సెంట్రల్ లండన్‌లో సరాసరి వార్షిక సంఖ్యలు దీనికి రెట్టింపు కనిపిస్తున్నా తైవాన్ అధ్యయనం లోని ఎక్కువ స్థాయిల కన్నా అక్కడ తక్కువ స్థాయిలే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రపంచం లోని ఇతర నగరాల్లో వాయు కాలుష్యస్థాయిలు అధికం గానే కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ వివరాల ప్రకారం పిఎం 2.5ఎస్ వార్షిక సరాసరి కాబూల్‌లో 86 మిల్లీ గ్రాములు, బీజింగ్‌లో 85 మిల్లీ గ్రాములు, ఢిల్లీలో123 మిల్లీగ్రాములు వంతున కాలుష్య స్థాయిలు రికార్డు అవుతున్నాయి. నోటి క్యాన్సర్‌కు వాయు కాలుష్యానికి గల సంబంధాన్ని వెలుగు లోకి తేవడం ఎంతో ఉపయోగకరమని పలువురు నిపుణులు అభిప్రాయ పడ్డారు.

బ్రిటన్‌లో మాత్రం వాయు కాలుష్యానికి నోటి క్యాన్సర్‌కు సంబంధం చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే తమల పాకును అతిగా నమలడం వల్లనే నోటి క్యాన్సర్ దాపురిస్తుందని వైద్యులు చెబుతుంటారు. అటువంటి అలవాటు బ్రిటన్‌లో లేదు. తైవాన్‌లో మాత్రం తమలపాకు సేవనం విపరీతంగా ఉంటున్నందున నోటి క్యాన్సర్ కు ఇదీ కూడా కారణమవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News