Saturday, November 16, 2024

వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు ఉద్యమం: రాకేష్ టికాయిత్

- Advertisement -
- Advertisement -

Movement Continued till farm laws repealed: Rakesh Tikait

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం కలిగిస్తున్న కొత్త వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేసేవరక ఉద్యమం కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియన్(బికెయు) ప్రతినిధి రాకేష్ టికాయిత్ స్పష్టం చేశారు. బుధవారం నిర్వహించిన బ్లాక్‌డే సందర్భంగా ఆయన మాట్లాడారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని, ఎక్కువ మంది గుమి కూడకుండా ఎక్కడివారు అక్కడే నల్లజెండాలు ఎగుర వేయాలని సూచించినట్టు ఆయన చెప్పారు. తమ ఉద్యమం చేపట్టి ఆరునెలలైనా కేంద్రం తమ వాణిని వినిపించుకోవడం లేదని, అందుకే రైతులు నల్లజెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నారని వివరించారు. చట్టాలు రద్దు చేసి పంట ఉత్పత్తులకు మద్దతు ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయమై కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు.

Movement Continued till farm laws repealed: Rakesh Tikait

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News