Wednesday, January 22, 2025

బిసిల కులగణన, మహిళలకు సబ్ కోటా కోసం ఉద్యమం : యాదవ మహాసభ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో బిసిల కులగణన చేపట్టాలని, మహిళా రిజర్వేషన్‌లో బిసి మహిళలకు సబ్ కోటా కల్పించాలని యాదవ మహాసభ డిమాండ్ చేసింది. చట్టసభల్లో ఓబిసిలకు 50 శాతం సీట్లు కేటాయించాలని కోరింది. ఇందు కోసం జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్లు అఖిల భారతీయ యాదవ్ మహాసభ అద్యక్షుడు మహేష్ యాదవ్ తెలిపారు.

మహేష్ యాదవ్ అద్యక్షతన అఖిల భారతీయ యాదవ్ మహాసభ జాతీయ కార్య వర్గం దక్షిణ భారత దేశ పర్యటనలో భాగంగా తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఆయన యాదవ్ మహాసభ ముఖ్య లక్ష్యాలను, వాటిని అమలు చేసేందుకు ప్రణాళికలను వివరించారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో సమగ్రంగా, 7 రాష్ట్రాలలో పాక్షికంగా యాదవ మహాసభ కార్య వర్గం నిర్మాణం చేసు కొని యాదవులు, ఓబిసి హక్కుల కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో ఓబిసి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్‌లు కల్పించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లో అఖిల భారతీయ మహాసభ నూతన అధ్యక్షుడు గా ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, జాతీయ జనరల్ సెక్రెటరీ గా పాడాల కళ్యాణి(కరాటే కళ్యాణి యాదవ్) ని నియమించినట్లు తెలిపారు.

యాదవ్ మహాసభ రాష్ట్ర కమిటీ ఏర్పాటు
ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్ (తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు), బి మహేష్ యాదవ్ – (యూత్ ప్రెసిడెంట్), పొలాస మల్లేష్ యాదవ్ – (ఉపాధ్యక్షుడు ),వేల్పూర్ సాయన్న -(ప్రధాన కార్యదర్శి), బేరి రామచంద్ర యాదవ్ -(ప్రధాన కార్యదర్శి), రఘు యాదవ్- (మీడియా ఇంచార్జి), జక్కుక నవీన్ యాదవ్- (కార్యదర్శి), జెరగొల్ల గంగాధర్ (సభ్యుడు), నెగుల శ్రీనివాస్ యాదవ్- (లీగల్ సెల్ ప్రెసిడెంట్), కృష్ణ స్వామి యాదవ్ – (లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్), జగదీష్ యాదవ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News