Monday, January 20, 2025

బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో డివిజన్ కోసం ఉద్యమం

- Advertisement -
- Advertisement -
  • జెఎసి చైర్మన్ పరమేశ్వర్, జడ్పిటిసి గిరికొండల్ రెడ్డి

మద్దూరు: బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో రెవెన్యూ డివిజన్ సాధన కోసం ఉద్యమించాలని జెఎసి చైర్మన్ రామగల్ల పరమేశ్వర్, జడ్పిటిసి, కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరికొండల్ రెడ్డి అన్నారు. గురువారం మద్దూరు మండలం కేంద్రంలోని తాజ్ ఫంక్షన్ హాల్‌లో జెఎసి సమావేశం సిపిఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చేర్యాల తాలుకాగా నియోజక వర్గ కేంద్రంగా ఉండి రోజు రోజుకు చిన్న మండలంగా కుదించబడి ఆస్తిత్వాన్ని కోల్పోతుందని అందోళన వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిల ఫక్షం జెఎసిగా అనేక అందోళన కార్యక్రమాలు చేస్తూ 56 గ్రామ పంచాయతీలు తీర్మాణం చేసి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి అందజేసినప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి స్పష్టత లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

చేర్యాట చేటి పరిస్థితి అసెంబ్లీ జనగామ, ఎంపి భువగిరి, జిల్లా సిద్దిపేట రెవెన్యూ డివిజన్ కోర్టు సిద్దిపేట వ్యవసాయ శాఖ, గజ్వేల్ విద్యుత్ శాఖ, హుస్నాబాద్ ఇలా కుక్కులు చింపిన విస్తారు లాగా చేర్యాల పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించేంతవరకు గ్రామాల్లో జెఎసిగా సబ్బండ కుల, మతాలు పార్టీలకు అతీతంగా గ్రామస్థాయిలో జెఎసిని పటిష్టపరిచి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని వారు తెలిపారు. అనంతరం జెఎసి మద్దూరు మండల కమిటీని ఎన్నిక చేశారు.

జెఎసి మండల కన్వీనర్‌గా తాజ్ మహమ్మద్, కో కన్వీనర్‌గా రామడుగు బాలరాజు, బొమ్మగాని శివయ్యగౌడ్, ఇట్టబోయిన కనకచంద్రం, చేటుకూరి శ్రీశైలం, ఎండి షపి, వబోజు నరసింహాచారి, సుంకోజు ప్రశాంత్, ఎండి. ముంతాజ్, ఇర్రి రాజేశ్వర్‌రెడ్డి, ఇర్రి సుదాకర్ మొత్తం 15 మందితో కమిటీని ఎన్నుకున్నారు. సమావేశంలో జెఎసి కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె ఆశోక్, జెఎసి నియోజక వర్గ యూత్ నాయకులు గద్దల మహేందర్, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు కామెడి జీవన్ రెడ్డి, రాగుల శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌రామడుగు బాలరాజు, మ్యాక మల్లేశం, సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, కాంగ్రెస్ నేతలు బండి కృష్ణమూర్తి, పులిగిల్ల రాజయ్య, ఇర్రి రమణారెడ్డి, పుల్లూరి రాజు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News