Thursday, January 23, 2025

ఉద్యమనేత మాజీబోర్డు సభ్యుడు ప్రభాకర్ ముదిరాజ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ : తెలంగాణ ఉద్యమ పోరాటంలో కంటోన్మెంట్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి తనకంటు ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేత అట్టడగు స్థాయి నుంచి కష్టపడుతు ప్రజల సేవాయో లక్షంగా పనిచేసిన నాయకుడు ప్రభాకర్ ముదిరాజ్. రాజకీయాల్లో తనకంటు ప్రత్యేక ముద్ర వేసుకొని ఎల్లప్పుడు ప్రజా సమస్యల పరిష్కరామే లక్షంగా పనిచేస్తు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని ఓడిన గెలిచిన ప్రజల్లో ఉంటు పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడు ప్రభాకర్ ఇకలేరు అనే వార్తను కంటోన్మెంట్ ప్రాంతవాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. గత వారం అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించటంతో కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు.

అప్పటి నుంచి చికిత్స పొంతుతున్న ప్రభాకర్ క్షేమంగా ఇంటికి చేరుకుంటారని అంతా అనుకున్నారు.గురువారం అర్థరాత్రి ఆయన మృతి చెందాడని చెప్పటంతో అందరు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆయన మరణవార్తను తెలుసుకున్న కంటోన్మెంట్ ప్రాంతంలోని పలువురు రాజీకీయాలకు అతీతంగా ఆయన బలంరాయిలోని ఆయన నివాసానికి వెళ్లి పార్థీవదేహంను సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆయనకు నివాళులు అర్పించిన వారికిలో బిఅర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంట్ ,కంటోన్మెంట ఇంచార్జీ మర్రిరాజశేఖర్‌రెడ్డి,మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, టిఎస్‌ఎమ్‌ఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ పలువురు బిఅర్‌ఎస్ నేతలు నివాళులు అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News