Wednesday, March 26, 2025

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో…

- Advertisement -
- Advertisement -

ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్ వంటి సందేశాత్మక బాలల చిత్రాలతో పసి మనసుల్లో మంచిని నాటే ప్రయత్నం చేసి ఎంతోమంది పిల్లలు, తల్లిదండ్రుల ప్రశంసలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న మరో బాలల చిత్రం ‘అభినవ్’. ఈ చిత్రంలో సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్, గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో దర్శక, నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ “మన సమాజానికి జాఢ్యంలా పట్టుకున్న డ్రగ్స్ భూతం విద్యార్థులనూ వదలడం లేదు. డ్రగ్స్ మాఫియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మన దేశాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోంది. ఇందులో అంతర్జాతీయ కుట్ర కోణం కూడా ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి మాఫియా బాగా పెరిగింది. స్వాతంత్య్ర సమరయోధుడైన తన తాతయ్య నారాయణరావు స్ఫూర్తితో అభినవ్ అనే సాహస బాలుడు ఈ గంజాయి మాఫియా ఆట ఎలా కట్టించాడు అనేది ఈ చిత్రంలో చూడబోతున్నారు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News