Wednesday, January 22, 2025

మళ్లీ ఎనర్జిటిక్ ప్రభాస్‌ను చూస్తారు

- Advertisement -
- Advertisement -

Movie in Prabhas and Maruthi combination

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు భారీ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తన లైనప్‌లో అన్నీ పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలే ఉన్నాయి. అయితే ప్రభాస్ నుంచి ఒక పర్ఫెక్ట్ ట్రీట్ కోరుకుంటున్న అభిమానులకి మాత్రం తాను అసలైన ట్రీట్‌ని అందిస్తానని ఓ డైరెక్టర్ చెబుతున్నాడు. ఆ దర్శకుడే మారుతీ. తాజాగా ఈ దర్శకుడు మాట్లాడుతూ తన సినిమాతో మళ్ళీ బుజ్జిగాడు, డార్లింగ్ సినిమాల్లో కనిపించిన ఎనర్జిటిక్ ప్రభాస్‌ని చూపించే ప్రయత్నం చేస్తున్నానని, ప్రస్తుతం ఆ పనుల్లో మా టీం అంతా ఉన్నామని చెప్పాడు. తప్పకుండా మళ్ళీ ప్రభాస్‌ని అలా చూస్తారని ఒక నమ్మకాన్ని అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌కి మారుతీ ఇచ్చాడు. ఇదే కానీ జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఏ పాన్ ఇండియా సినిమా కూడా ఇవ్వని కిక్ ఈ ఒక్క చిత్రం ఇస్తుందనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News