స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ “బేబీ చూసిన తరువాత జాక్ హీరోయిన్ వైష్ణవి అని ఫిక్స్ అయ్యాం. వైష్ణవి చాలా గొప్ప నటి. మరింత గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. బొమ్మరిల్లు భాస్కర్‌తో ఆరెంజ్ సినిమాను చేశాను.
ఆయన 24 గంటలు సినిమా కోసమే ఆలోచిస్తుంటారు. టిల్లు, టిల్లు స్క్వేర్‌తో నాకు ఓ కామెడీ టైమింగ్ ఏర్పడింది. ఆ టైమింగ్‌ను జాక్‌లో మిస్ అవ్వకుండా చేశారు బొమ్మరిల్లు భాస్కర్. జాక్ చిత్రం రెండు వందల శాతం అందరికీ నచ్చుతుంది. ఎక్కడా ఎవ్వరినీ నిరాశపర్చదు”అని అన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ “వైష్ణవి అద్భుతమైన నటి. ఎలాంటి సీన్‌ను అయినా సులభంగా నటించేశారు. సిద్దులో తెలియని స్పార్క్‌ని ఎప్పుడో చూశాను. ఇప్పుడు అది వైల్డ్ ఫైర్‌లా ఉంటుంది. జాక్ అనేది మన అందరి కథ. ఒక రాయి, ఒక శిల్పానికి.. ఒక తాబేలు, కుందేలు.. ఓ ఎయిర్ బస్, ఎర్ర బస్సుకి మధ్య జరిగే కథ. మా సినిమాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి” అని తెలిపారు.
నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “జాక్ మంచి చిత్రం అవుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని తెలియజేశారు. వైష్ణవి చైతన్య మాట్లాడుతూ “జాక్ చిత్రానికి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రయాణం నా జీవితాంతం గుర్తుంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి అద్భుతమైన డైరెక్టర్‌తో పని చేయడం లక్కీ. నాకు ఇందులో ఓ మంచి క్యారెక్టర్ లభించింది. సిద్దు అద్భుతమైన కో స్టార్”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యదేవర నాగవంశీ, చందూ మొండేటి, కార్తిక్ దండు, కళ్యాణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.