Monday, December 23, 2024

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

- Advertisement -
- Advertisement -

Movie star Tanuj planted plants

 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసిపార్కులో సినీ నటుడు తనుజ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తనుజ్ మాట్లాడుతూ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తు చేశారని అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద వీలైనన్నీ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం హీరోయిన్ నైనా గంగులీ, నిర్మాతలు తేజ ఉప్పలపాటి, రాజేందర్‌రెడ్డి ముగ్గురికి తనుజ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News