Wednesday, January 22, 2025

8 వారాల తర్వాతే ఓటిటిలో సినిమాలు: దిల్ రాజు

- Advertisement -
- Advertisement -

 

Dil Raju

హైదరాబాద్: నిర్మాతలందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు తెలిపారు. ఆయన గురువారం ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా ఛాంబర్‌లో మాట్లాడారు. ఇకపై ప్రతి సినిమా 8 వారాల తర్వాతే ఓటిటిలోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంతేకాకుండా థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్లలోని ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటు ధరలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. విపిఎఫ్ ఛార్జీలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, శుక్రవారం ఎగ్జిబిటర్లతో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని కూడా దిల్ రాజు తెలిపారు.
చిత్ర పరిశ్రమలోని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. నిర్మాణ వ్యయంను తగ్గించుకునే విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)తో ఓ ఒప్పందానికి వచ్చామన్నారు. రెండు, మూడు వారాల్లో అన్నీ ఒక కొలిక్కి వస్తాయన్నారు. మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తర్వాత మీడియాకు చెబుతామన్నారు. తెలుగు సినీ పరిశ్రమ తీసుకునే నిర్ణయాలను హిందీ చిత్ర పరిశ్రమ, దక్షిణాదిలోని మిగతా చిత్ర పరిశ్రమలు కూడా గమనిస్తున్నాయని దిల్ రాజు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News